గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు ఫ్యామిలీ ఫిజిషియన్ ద్వారా మెరుగైన సేవలు అందుబాటులోనికి వచ్చినట్లు తాళ్లూరు పీహెచ్సీ వైద్యాధికారి ఖాదర్ మస్తాన్ బి అన్నారు. మన్నేపల్లి పంచాయితీ పరిధిలోని దారం వారి పాలెంలో శనివారం ఫ్యామిలీ ఫిజిషియన్లో బాగంగా వైద్య సేవలు అందించారు. అనంతరం తాతలకు జగనన్న కంటి వెలుగు పథకంలో భాగంగా కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. సర్పంచి మంచాల వెంకటేశ్వర రెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఆఫ్తాలజి టెక్నిషియన్ ఉమా, గ్రామకార్యదర్శి నూరుల్లా, ఎంపీహెచ్ఎస్ కోటేశ్వరి, ఎం. ఎల్ హెచ్పి మంగా బాయి, ఆరోగ్య, ఆశా, 104 సిబ్బంది పాల్గొన్నారు.
ఫ్యామిలీ ఫిజిషియన్ ద్వారా మెరుగైన సేవలు – తాళ్లూరు పీహెచ్సీ వైద్యాధికారి ఖాదర్ మస్తాన్ బి
04
Feb