ఫెర్టిలైజర్స్ దుకాణాలు తనిఖీ – అధిక ధరలకు పురుగు మందులు విక్రయిస్తే కఠిన చర్యలు – వ్యవసాయాధికారి ప్రసాదరావు

తూర్పుగంగవరంలో పలు ఫెర్టిలైజర్స్ దుకాణాలను శనివారం వ్యవసాయాధికారి ప్రసాదరావు అకస్మిక తనిఖీ నిర్వహించారు. మిరుపలో తామర పురుగుల నివారణకు సమర్ధవంతంగా పనిచేస్తుందని రక రకాల మందులు వస్తున్నాయని దానికి ఆసరాల చేసుకుని దుకాణాల వారు కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు అమ్మినట్లయితే కఠిన చర్యలు తప్పవని అన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు, ఎంఆర్పీకి అమ్మాలని, తప్పనిసరిగా బిల్లులు ఇవ్వాలని, రైతులు కూడ బిల్లులు తీసుకోవాలని కోరారు. దుకాణాదారులు తప్పనిసరిగా రికార్డులు నిర్వహించాలని, స్టాక్ ల నిల్వలకు, రికార్డులను తేడాలు ఉంటే చట్టపరమైన చర్యలు తప్పవని అన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *