ప్రకాశం జిల్లాలోని తాళ్లూరు మండలంలోని విఠలాపురం పంచాయితీ సర్పంచి మారం ఇంద్రసేనా రెడ్డి, తాళ్లూరుకు చెందిన కె నాగార్జున రెడ్డిపై తాళ్లూరు ఎంపీడీఓ కె పై కీర్తి ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై ప్రేమకుమార్ తెలిపారు. వివరాలలోనికి వెలితే ..పోలీసులు కథనం ప్రకారం …విఠలాపురం పంచాయితీ పరిధిలో ఎంఎస్ఆర్ఎస్ఈజీఎస్ పథకంలో చేపట్టిన నాలుగు. పనులకు సంబంధించి రూ.54,68,835 లను ప్రభుత్వం విడుదల చేసింది. ఆపనులు విఠలాపురంకు చెందిన మానం రమేష్ బాబు, రమణాల వారి పాలెంకు చెందిన కాలేషాబాబులు చేసినట్లు రికార్డు పరంగా ఉన్నది. అయితే ఆ పనులు చేసినట్లు మరోక ముద్దాయి కె నాగార్జున రెడ్డికి సర్పంచి ఇంద్రసేనా రెడ్డి ఆనగదును మోసపూరితంగా, డూప్లికేట్ డాక్యుమెంట్లు సృష్టించిన నాగార్జున రెడ్డికి చెల్లించారు. అంతేకాక మరొక పనిలో కాలేషావలి చేసిన పనికి మెటీరియల్ నగదును సర్పంచి స్వతహాగా తనచెక్కు ద్వారా రూ. 11,97,554ను డ్రా చేసారు. సర్పంచి పదవికి ఉన్న అధికారాన్ని దుర్వినియోగం చేసి నిధులు డ్రా చేసి ఇతరులకు ఇవ్వటం, తన వాడుకోవటంపై పంచాయితీ రాజ్ అధికారులు కలెక్టర్ కు నివేదిక ఇచ్చారు. దీంతో కలెక్టర్ ఆదేశాల మేరకు ఎంపీడీఓ కెవై కీర్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు.
విఠలాపురం సర్పంచి మారం ఇంద్రసేనా రెడ్డిపై కేసు నమోదు – ఎంపీడీఓ ఫిర్యాదు మేరకు నిధుల దుర్వినియోగంపై కేసు నమోదు
06
Feb