రాష్ట్రంలోని అన్ని దేవాలయాలలో ట్రస్టు బోర్డు మెంబర్లుగా నాయి బ్రాహ్మణులకు అవకాశం కల్పిస్తూ ఆర్డినెన్స్ తీసుకురావడంతో సీఎం జగన్ మోహన్ రెడ్డి నాయి బ్రాహ్మణుల గుండెల్లో చిరస్థాయిలో నిలిచారని వైఎస్ఆర్సిపి బీసీ నాయకులు మరియు నాయి బ్రాహ్మణ సంక్షేమ సంఘం సీనియర్ నాయకులు అన్నవరపు వెంకట రవి తెలిపారు… రాష్ట్రంలోని అన్ని దేవాలయాలలో నాయి బ్రాహ్మణులకు ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా అవకాశం కల్పించినందుకు గాను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశామని తెలిపారు…గత టిడిపి ప్రభుత్వంలో నాయి బ్రాహ్మణులు తోకలు కత్తిరిస్తామంటూ నాయి బ్రాహ్మణులను అగౌరవపరచే విధంగా నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడితే, నేడు నాయి బ్రాహ్మణులును రాష్ట్రంలోనే ఉన్నత స్థాయిలో నిలిపిన ముఖ్యమంత్రిగా సీఎం జగన్ నిలిచాడని కొనియాడారు… సెలూన్ షాపులకు 150 యూనిట్ల వరకు సబ్సిడీపై విద్యుత్ అందించడం, జగనన్న చేదోడు తో సెలూన్ షాపులలో పనిచేసే వారికి పదివేల రూపాయల సహకారం అందించిడం వంటి ఎన్నో సంక్షేమ పథకాలతో నాయి బ్రాహ్మణ జాతి రూపు రేఖలు మార్చిన ఘనత సీఎం జగన్ మోహన్ రెడ్డి కే చెందుతుంది అన్నారు. నాయి బ్రాహ్మణుల అభివృద్ధికి నిరంతరం పాటుపడే ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వెంటే ఉండి ముఖ్యమంత్రిగా సీఎం జగన్ మోహన్ రెడ్డి నే మళ్లీ గెలిపించుకుంటామని.. ఈ సందర్భంగా అన్నవరపు వెంకట రవి తెలిపారు..ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సంక్షేమ సంఘ సభ్యులు అనిల్, ప్రసాదు, సుబ్బారావు, శివశంకర్, హనుమంతు, రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.
