చైల్డ్ ఇన్ఫో ఎంట్రీపై పది రోజుల పాటు గడువు ఇవ్వాలని స్కూల్ ఎడ్యుకేషన్ కమీషనర్ కి విన్నవించిన ఎపీ ప్రవేట్ స్కూల్స్ ఆసోషియేషన్ ప్రతినిథులు – ప్రైమరీ సెక్షన్ గుర్తింపునే ఫ్రీ ప్రైమరీ సెక్షన్ లకు వర్తింప చెయ్యాలి – ప్రభుత్వ గుర్తింపు పది సంవత్సరాలు పెంచి బడ్జెట్ పాఠశాలలను ఆదుకోవాలి

ఫ్రీ ప్రైమరీ విద్యార్థులను చైల్డ్ ఇన్ఫో ఎంట్రీ చేయటానికి మరో పది రోజుల పాటు సమయం ఇవ్వాలని ఎడ్యుకేషన్ కమీషనర్, డైరెక్టర్ ఎస్. సురేష్ కుమార్ కి ఏపీ ప్రవేట్ స్కూల్స్ అసోషియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు టి. సుందర్ రామ్, రాష్ట్ర అధ్యక్షుడు కొమరగిరి చంద్రశేఖర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం. జనార్ధన్ రావు, రాష్ట్ర కోశాధికారి మేకల రవీంద్రబాబు, ఆడిషనల్ ప్రధాన కార్యదర్శి రవి చంద్రా రెడ్డి, ఫైనాన్షియల్ సెక్రటరి అప్పాజీ లు మంగళవారం విన్నవించారు. రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన బడ్జెట్ స్కూల్స్ అనేక ఇబ్బందులకు గురవుతున్నామని తెలిపారు. చిన్నారులైన విద్యార్థుల ఆధార్ నంబర్లు, తల్లిదండ్రుల వివరాలు, వారి సచివాలయ పరధి వివరాలు సేకరించటానికి కొంత సమయం పడుతుందని అన్నారు. గతంలో ఆర్. సి నెంబర్ 74ను అనుసరించి పది విద్యా సంవత్సరాలు ఉన్న ప్రభుత్వ గుర్తింపును హఠాత్తుగా 3 విద్యా సంవత్సరాలుగా గుర్తింపు ఇవ్వటంతో బడ్జెట్ స్కూల్ పడరాని ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. మరొక సారి పరిశీలించి తిరిగి పది విద్యా సంవత్సరాలు గుర్తింపును కొనసాగించాలని కోరారు. ఇప్పటికే ఒకటి నుండి ఏడవ తరగతి వరకు ప్రభుత్వ గుర్తింపు ఉన్న పాఠశాలకు అదే ఫైల్స్ పై నర్సరీ, ఎల్.కె. జి. యూ. కె. పి అయినటు వంటి ఫ్రీ ప్రైమరీ సెక్షన్స్ గుర్తింపు ఇవ్వాలని విన్నవించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *