వరిలో తెగుళ్లపై రైతులకు అవగాహన – దర్శి కృషి విజ్ఞాన కేంద్రం కీటక విభాగం శాస్త్రవేత్త డాక్టర్ జాహ్నవి రైతులకు పలు సూచనలు – పరిశీలించిన వ్యవసాయ కళాశాల విద్యార్థులు

వరి సాగులో తెగుళ్ల నివారణకు చేపట్టే చర్యలపై దర్శి కృషి విజ్ఞాన కేంద్రం కీటక విభాగం శాస్త్రవేత్త డాక్టర్ జాహ్నవి రైతులకు అవగా హన కల్పించారు. ముండ్లమూరు మండలంలోని పెద ఉల్ల గల్లులో వరి పంటను సీ.ఎస్ . పురం కే.బీ.ఆర్ వ్యవసాయ కళాశాల విద్యార్థులతో కలిసి మంగళవారం ఆమె పరిశీలించారు. క్షేత్ర పరిశీలనలో భాగంగా వరిలో ఉల్లికోడు యాజమాన్య పద్ద తులపై రైతులకు అవగాహన కల్పించారు. ప్రస్తుతం వరిలో బ్యాక్టీరియా, ఆకు ఎండు, అగ్గి తెగులును గుర్తించారు. వాటి నివారణ చర్యలపై రైతులకు అవగాహన కల్పించి పలు సలహాలు, సూచనలు చేశారు. వ్యవసాయ కళాశాల విద్యార్థులు ఆసక్తిగా పరిశీలించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *