తాళ్లూరు మండలం విఠలాపురం పంచాయితీలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ
పథకంలో చేపట్టిన పనులకు బిల్లుల చెల్లింపులో జరిగిన నిధుల దుర్వినియోగంపై
నమోదు అయిన కేసులో బుధవారం దర్శి సీఐ రామ కోటయ్య విచారణ చేపట్టారు.
ఎంపీడీఓ కెవై కీర్తి, ఈఓఆర్డీ ఎన్ యూ ప్రసన్నకుమార్ ల తో కలసి కేసు నమోదు అయ్యే వరకు దారితీసిన పరిస్థితులపై ఆరా తీసారు. ఎఎస్సై మోహన్ రావుతదితరులు ఆయన వెంట ఉన్నారు.
నిధుల దుర్వినియోగంపై విచారణ చేపట్టిన దర్శి సీఐ
08
Feb