కేంద్ర బడ్జెట్ సమావేశాలలో ,రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలను అమలు చేయకుండా అన్యాయం చేసిందని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్ఐ) జిల్లా అధ్యక్షులు కే వి పిచ్చయ్య తెలిపారు.దర్సిలో సుందరయ్య భవన్ లో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కే వి పిచ్చయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గడిచిన ఇన్ని పార్లమెంటు సమావేశాలలో,బడ్జెట్ సమావేశాలలో ప్రత్యేక హోదా, విభజన హామీలను అమలు చేయకుండా. నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగులకి బడ్జెట్ ని కేటాయించకుండా జరిగిన బడ్జెట్ సమావేశాలలో చిత్తశుద్ధి కనబడుతున్నది అన్నారు. ఒకవైపు నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించక వలసలు పోతున్నారని అన్నారు.విభజన చట్టంలో స్పష్టంగా రాసుకున్న హోదా.వీటి అమలు కోసం రాష్ట్రంలోని అధికార ,ప్రతిపక్ష పార్టీలు సైతం పార్లమెంటు లో కేంద్రం పై ఆశించిన రీతిలో పోరాడటం లేదు అన్నారు.ఇప్పటికైనా అధికార, విపక్షాలు కేంద్రం పై గళం విప్పాలని అన్నారు.ఈ సమావేశంలో DYFI దర్శి మండల అధ్యక్షులు ఆర్ జేసీ పాల్. మండల కార్యదర్శి ఎస్ కోటిరెడ్డి తదితరుల పాల్గొన్నారు
నిరుద్యోగుల్ని నిరాశపరిచిన కేంద్ర బడ్జెట్… బడ్జెట్లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం….డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కే వి పిచ్చయ్య….
08
Feb