బొద్దికూరపాడులో చేపల పెంపకానికి చెరువు వేలం పాట వాయిదా

తాళ్లూరు మండలం బొద్దికూరపాడు పంచాయతీ పరిధిలోని చెరువులో చేపలు పెంచుకోవటానికి బుధవారం
ఏర్పాటు చేసిన బహిరంగ వేలం పాటను, అనుకున్న సంఖ్యలో పాట దారుల రానందు వలన వాయిదా వేసినట్లు ఈఓఆర్డీ ఎన్ యూ ప్రసన్నకుమార్ తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రారంభ ధర ఎక్కువగా ఉండటంతో గిట్టుబాటు కాక పోవటంతో పాటలో పాల్గొనేందుకు ఎవరూ ఆసక్తి చూపలేదు. దీంతో అనివార్య కారణాలతో పాటను వాయిదా వేసినట్లు గ్రామకార్యదర్శి షేక్ షహనాజ్ బేగం తెలిపినట్లు ఈఓఆర్డీ వివరించారు. తదుపరి పాట నిర్వహణ తేదీలను మరోసారి
తెలియజేస్తామని ఒక ప్రకటనలో తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *