అంగన్వాడీలను ఆదుకొంది సీఎం జగన్
రాష్ట్రంలో 55,607 అంగన్వాడీ కేంద్రాల్లో వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్‌తో ఆర్నెల్ల పసి బిడ్డల నుంచి ఆరేళ్ల పిల్లల వరకు, గర్భిణులు, బాలింతలకు పోషకాహారాన్ని అందించి బలమైన సమాజానికి ఊతమిస్తున్నారు.
1) అంగన్వాడీ వర్కర్లకు ఎన్నికలకు కొద్దిగా ముందు వరకు రూ.7 వేలు మాత్రమే వేతనాలు చెల్లించగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాగానే రూ.11,500కి పెంచింది. 2019 జూలై నుంచి పెంచిన జీతాలను చెల్లించింది.
2) అంగన్వాడీ హెల్పర్లకు ఎన్నికలకు కాస్త ముందు వరకూ రూ.4,500 మాత్రమే వేతనాలు చెల్లించగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక రూ.7 వేలకు పెంచింది. 2019 జూలై నుంచి పెంచిన జీతాలను చెల్లిస్తోంది.
3) సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో అంగన్వాడీ వర్కర్లకు పదోన్నతులు కల్పించారు. ఆ పదోన్నతుల ద్వారా 560 గ్రేడ్–2 సూపర్ వైజర్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది. సూపర్వైజర్ పోస్టుల పరీక్షలకు వయో పరిమితిని 45 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు పెంచుతూ ఈ ప్రభుత్వం జీవో ఇచ్చింది.
సీఎం వైఎస్ జగన్ పెద్ద మనసు కారణంగా తొమ్మిదేళ్లుగా ప్రమోషన్ల కోసం నిరీక్షిస్తున్న వారికి వయోపరిమితి పెంపు ఎంతో ఉపయోగపడింది.
ఏళ్ల తరబడి డిమాండ్ చేస్తున్న పదోన్నతుల అంశాన్ని చంద్రబాబు ఐదేళ్ల పాలనలో కనీసం పట్టించుకోలేదు.
4)అంగన్వాడీ వర్కర్లు, ఆయాలు, సూపర్వైజర్లు విధులను సజావుగా నిర్వహించడం, అత్యుత్తమ సేవలను అందించేందుకు ప్రభుత్వం టెక్నాలజీని వినియోగించుకుంటోంది.
దీనికోసం వారికి స్మార్ట్ఫోన్లు అందించింది. 56,984 స్మార్ట్ ఫోన్ల కొనుగోలుకు రూ. 68.61 కోట్లను ప్రభుత్వం వెచ్చించింది.
5)అంగన్వాడీల నిర్వహణలో భాగంగా వంట చెరకు, కూరగాయలు, రవాణా ఖర్చుల నిమిత్తం మార్చి వరకు బడ్జెట్ విడుదల చేసింది.
6) మొత్తం మూడు దశల్లో నాడు – నేడు ద్వారా అంగన్వాడీ కేంద్రాల భవనాల అభివృద్ధి కోసం దాదాపు రూ.1,350 కోట్లతో ప్రణాళిక సిద్ధం చేశారు.
