అంగన్వాడీ కార్యకర్తలు చిరుధాన్యాలలో లభిస్తున్న పోషకాలపై గ్రామీణ ప్రాంతాలలో మరింత అవగాహన పెంచాలని వక్తలు అన్నారు. ఐసీడీఎస్. కార్యాలయంలో గురువారం చిరుధాన్యాల సంవత్సరాన్ని పురష్కరించుకుని చిరుధాన్యాలతో తయారు చేసిన పలు పదార్ధాలను వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ప్రదర్శించారు. ప్రభుత్వం అంగన్వాడీ ద్వారా అందిస్తున్న పౌష్టికాహారంతో పాటు చిరుధాన్యాలలో లభించి పీచు పదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్స్, ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలను గురించి ఎ.పి.పి ఎడీ ఎఫ్రాయిమ్, వ్యవసాయాధికారి ప్రసాదరావులు వివరించారు. ముఖ్యంగా ఐరన్, రక్తహీనతతో బాధపడుతున్నవారికి ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. అనంతరం చిరుధాన్యాలతో చేసిన పదార్థాలను అంగన్వాడీలు భుజించారు. కార్యక్రమంలో సూపర్వైజర్లు జ్యోతి. హేమలత, సునీత, నాగమణి, ఆనందలత తదితరులు పాల్గొన్నారు.
అంగన్వాడీలు చిరుధాన్యాల పోషకాలపై అవగాహన పెంచాలి
09
Feb