దర్శి మండలంలోని బొట్లపాలెం గ్రామం లో GAP క్లస్టర్ పొలంబడి కార్యక్రమం గురువారం నిర్వహించారు . జిల్లా వ్యవసాయ అధికారి యస్. శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడుతూ .. రైతు లు పురుగు మందులు పిచికారి చేయునపుడు రైతు పై ప్రభావం ఏ విధంగా వుంటుందో, వాటి వల్లన ఏ విధంగా అనారోగ్యాన్ని గురి అవుతారో చార్ట్ రూపంలో రైతు లకు వివరించడం జరిగింది. అలాగే మొక్కల పై అదే విధమైన ప్రభావం ఉంటుంది కనుక తెగులు, పురుగుల తీవ్రత ని బట్టి మాత్రమే పురుగు మందులు అనవసరం గా వాడరాదు అని వాడటం వలన మొక్కలు మరియు మనుషులు అనారోగ్యానికి గురి అవుతారు అని తెలియజేశారు. అలా వాడటం వల్ల వ్యవసాయనికి పెట్టుబడి కూడా భారం గా మారుతుంది అని తెలియజేశారు.
అలాగే పురుగు మందులు పిచ్ కారీ చేసేటప్పుడు మాస్క్ ధరించి పిచ్ కారీ చేయవలెను అని సూచించడం జరిగింది.
కార్యక్రమంలో సాంకేతిక వ్యవసాయ అధికారి శ్రీనివాస్ నాయక్, మండల వ్యసాయాధికారి బాలకృష్ణ నాయక్ మరియు వి. ఏ. ఏ. షేక్ మాసుం బాజీ పాల్గొన్నారు.
