అంకిత భావం తో పని చేస్తే గుర్తింపు తప్పని సరిగా వస్తుంది అని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీ శ్రీనివాసరావు అన్నారు . దర్శి సబ్ డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు కె.అర్జున్ నాయక్ ప్రకాశం జిల్లా యస్.సి కార్పొరేషన్ ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ గా పదోన్నతి పొందిన సందర్భంగా వీడ్కోలు సభ గురువారం కృషి విజ్ఞాన కేంద్రంలో జరిగింది.
కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు మాట్లాడుతూ .. కె. అర్జున్ నాయక్ ఉద్యోగ బాధ్యతలు అన్ని పశ్చిమ ప్రకాశం లోనే పూర్తి చేశారని, ఎంతో నీతి నిజాయితీతో ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తించారని, అంతేగాక తదుపరి ఉద్యోగంలో కూడా సమర్థవంతంగా నిర్వర్తించాలని కోరారు.
కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ .. ఇప్పటివరకు దర్శి సబ్ డివిజన్లో కే.అర్జున్ నాయక్ తనకు ఎంతో సహకరించారని తెలిపారు .
కార్యక్రమంలో దర్శి, దొనకొండ, కురిచేడు, పొదిలి, తాళ్లూరు,మరిపూడి మరియు కొనకనమిట్ల వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు . కార్యక్రమానికి ఇన్చార్జి సహయ వ్యవసాయ సంచాలకులు పి.నిర్మలాదేవి అధ్యక్షత వహించారు. అందరు వక్తలు కె.అర్జున్ నాయక్ గారు సేవలను కొనియాడారు.

