నిందితులపై కఠిన చర్యలు

ముండ్లమూరు మండలంలోని ఉమామహేశ్వరపురం గ్రామానికి చెందిన బీటెక్ విద్యార్థిని గూడాల కిరణ్మయి ఆత్మహత్య కేసులో నిందితులపై కఠిన చర్యలు తప్పవని దిశా డి ఎస్ పి వల్లంరాజు అన్నారు ఉమామహేశ్వర పురం గ్రామంలో శుక్రవారం కిరణ్మయి మృతదేహానికి రిమ్స్ వైద్య బృందం తో శవ పంచనామా నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కిరణ్మయి విశాఖపట్నంలో బీటెక్ చదువుతుండగా అదే గ్రామానికి చెందిన చింతల వెంకట నారాయణ రెడ్డి బలవంతంగా సెల్ ఫోన్. బంగారు ఉంగరం లాక్కొని బలవంతంగా రేప్ చేశాడు. అక్కడ అఘాయిత్యానికి పాల్పడి సెల్ ఫోన్ తో వీడియో తీసి ఎవరికైనా చెబితే చంపి వేస్తానని బెదిరించాడు. దీంతో మనస్థాపం చెందిన కిరణ్మయి జనవరి 13న పురుగుమందు తాగింది. దీంతో కుటుంబ సభ్యులు ఒంగోలు వైద్యశాలకు తరలించారు. అక్కడనుండి మెరుగైన వైద్య కోసం హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ ఎస్ ఉషారాణి. ఎస్సై ఎల్ సంపత్ కుమార్. వీఆర్వో. కావూరి దయానందం పోలీస్ సిబ్బంది అంకమ్మరావు. ప్రేమా నిధి. అంజి బాబు. తదితరులు పాల్గొన్నారు .

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *