జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిలను మాజీ ఎంపీపీ గోళ్లపాటి మోషే దంపతులు, కుటుంబసభ్యులు శుక్రవారం ఘనంగా సన్మానించారు. మాజీ ఎంపీపీ నివాసం రమణాల వారి పాలెంలో లో శుక్రవారం జరిగిన శుభ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ పాల్గొని వారికి ఆశీస్సులు అందించారు. కార్యక్రమంలో ‘జిల్లా కోఆప్షన్ మెంబర్ షేక్ ఆదాం షరీఫ్ (బుజ్జి), మాజీ ఎంపీపీలు పోశం మధుసూధన రెడ్డి, ఇత్తడి దేవదానం, జిల్లా సంయుక్త కార్యదర్శి ఐ. వెంకట సుబ్బారెడ్డి, ఎఎంసీ మాజీ డైరెక్టర్ గుజ్జుల యోగి రెడ్డి, చందన, సర్పంచిలు కెఎస్ వెంకట రామిరెడ్డి, మందా శ్యామ్సన్, జిల్లా యూత్ కార్యదర్శి జక్కుల రామక్రిష్ణ. మాజీ సొసైటీ చైర్మన్ కుమ్మిత నాగి రెడ్డి, తిరుపతి రెడ్డి, కుమ్మిత శ్రీనివాస రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముందుగా జిల్లా పరిషత్ చైర్మన్ కు , మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి కు రమణాల వారిపాలెంలో ఘన స్వాగతం పలికారు.

