దర్శి పట్టణంలో బిజెపి ఆధ్వర్యంలో పండిట్ దీన్ దయాలా ఉపాధ్యాయ వర్ధంతి కార్యక్రమం నిర్వహణ

దర్శి పట్టణంలో బిజెపి కార్యాలయం లో శనివారం పట్టణ అధ్యక్షులు అచ్యుత గురవా ర్జునరావు ఆధ్వర్యంలో పండిట్ దీన్ దయాలా ఉపాధ్యాయ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు . ఈ సందర్భం గా జిల్లా ఉపాధ్యక్షులు తిండి నారాయణరెడ్డి మాట్లాడుతూ .. ఏకాత్మ మానవతా వాద సిద్ధాంత కర్త, అంత్యోదయ స్ఫూర్తి ప్రధాత” శ్రీ పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ” ఆశయాల కనుగుణంగా ప్రధాని నరేంద్ర మోడీ అం త్యో దయ లక్ష్యంగా .. ప్రభుత్వ పథకాలు చిట్ట చివరి వ్యక్తి వరకు కూడా అందుతున్నందుకు ఆ విధంగా పరిపాలన సాగిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు . ప్రతి కార్యకర్త పండిట్ దీన దయాళ ఉపాధ్యాయ ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని కోరుకుంటూ .. పుణ్యతిథి సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తున్నాను. కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జ్ మాడపాకుల శ్రీనివాసులు, యువ మోర్చా పట్టణ అధ్యక్షులు వంకదారి కుమార్, బచ్చు అనిల్, అచ్యుత శరత్ కుమార్, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *