ముండ్లమూరు మండలంలోని మారెళ్ళ గ్రామంలో పోలేరమ్మ గుడి మండప నిర్మాణానికి ఆదివారం భూమి పూజ నిర్వహించారు మారెళ్ళ గ్రామానికి చెందిన కార్తికేయ కన్స్ట్రక్షన్ అధినేత కుంచాల నాగరాజు ఆరు లక్షల విరాళం ప్రకటించగా వారి తల్లిదండ్రులైన కుంచాల పుల్లయ్య, అలివేలమ్మ సహకారంతో భూమి పూజ నిర్వహించారు.22 అడుగుల వెడల్పు, 18 అడుగుల పొడవుతో నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. దీంతో మండపం నిర్మాణానికి ముందుకు వచ్చిన కుంచాల నాగరాజును మారెళ్ళ గ్రామస్తులు అభినందించారు. ఈ కార్యక్రమంలో తన్నీరు శ్రీరాములు, మైలా శీను, చిరుమామిళ్ల సుబ్బయ్య, ఓగులూరీ శ్రీ హర్ష, పోతిరెడ్డి మూర్తి రెడ్డి, షేక్ ఆంజనేయులు, చింతలపూడి ఆంజనేయులు, సుంకర వెంకటేశ్వర రెడ్డి, మేకల కోటిరెడ్డి,పూరి మెట్ల పేరయ్య, తదితరులు పాల్గొన్నారు.

