కిమ్స్ వైద్యుల ఆధ్వర్యంలో 280మందికి వైద్య పరీక్షలు

ముండ్లమూరు మండల కేంద్రమైన ముండ్లమూరులోని బస్టాండ్ సెంటర్లో గల పోలేరమ్మ దేవాలయం వద్ద ఆదివారం కిమ్స్ వైద్యుల ఆధ్వర్యంలో 280 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ వైద్య శిబిరం ముండ్లమూరు ప్రధమ చికిత్స కేంద్రం ఆర్ఎంపి వైద్యులు ఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జరిగినది. ఈ సందర్భంగా రామాంజనేయులు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు కార్పొరేట్ వైద్య సేవలు అందించాల నే లక్ష్యంతో నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో డాక్టర్ వైయస్సార్ ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి, ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ (ఈ హెచ్ ఎస్) ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కిమ్స్ హాస్పిటల్ నందు ఉచితంగా వైద్య సేవలు అందిస్తారు. ఈ శిబిరంలో కీళ్లు, ఎముకలు, నరములు, గుండె , గ్యాస్ ట్రబుల్, మరియు సాధారణ వ్యాధులకు చికిత్సలు అందిస్తామని తెలిపారు . షుగర్, బిపి, ఈసీజీ పరీక్షలు ఉచితంగా చేస్తామన్నారు. ఈ క్యాంపు లో చూపించుకున్న వారందరికీ నెలరోజుల పాటు ఉచితంగా ఓపి తోపాటు నిర్ణీత పరీక్షలలో 50% రాయితీ ఇస్తామన్నారు. ఈ శిబిరంలో 280 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా అందులో 25 మందికి కంటి పరీక్షలు, 30 మందికి గుండె పరీక్షలు,25 మందికి సాధారణ పరీక్షలు, 90 మందికి బీపీ పరీక్షలు ,110 మందికి షుగర్ పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. కంటి పరీక్షలు లోపాలు ఉన్నవారికి 25 మంది నీ రిమ్స్ హాస్పటల్ కు రిఫర్ చేశారు. ఈ కార్యక్రమంలో పి ఆర్ ఓ జి గురవయ్య, కంటి వైద్య నిపుణులు కే లత, కోమలి,పావని ,అరుణ ,రఫీ ,తేజ,రాజేష్,రవి ,పాపయమ్మ ,రాణి ,తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *