సర్పంచిగా ” మారం ” బాధ్యతలు స్వీకరణ- పనులు చేసిన వ్యక్తికి బిల్లులు చెల్లించాను – పూర్తి స్థాయిలో నావాదనలు వినిపిస్తాను – తాళ్లూరు మండల సర్పంచ్ ల సంఘం అధ్యక్షుడు మారం ఇంద్రసేనా రెడ్డి

విఠలాపురం సర్పంచిగా మారం ఇంద్రసేనా రెడ్డి సోమవారం తిరిగి బాధ్యతలు చేపట్టారు. పంచాయితీలో బిల్లుల చెల్లింపులో ఏర్పడిన వివాదంలో కోర్టు ఆదేశాల మేరకు మూడు నెలల పాటు సస్పెండ్ చేసారు. అయితే తన వివరణ లేకుండా తన పదవి నుండి సస్పెండ్ చేయటం అన్యామంటూ కోర్టును ఆశ్రయించారు. దీంతో ఆయనను సర్పంచ్ గా తదుపరి కోర్టు ఆదేశాలు వచ్చే వరకు కొనసాగించాలని జిల్లా కలెక్టర్ ఈనెల 14న ఆదేశాల జారీ చేసారు. ఆయన ఆదేశాల మేరకు సోమవారం సర్పంచి తిరిగి బాధ్యతలు చేపట్టి గ్రామంలో నెలకొన్న నీటి సమస్యపై చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… గత టిడిపి ప్రభుత్వంలో చేపట్టిన ఉపాధి హామీ పనుల బిల్లులు ప్రభుత్వం నుండి మంజూరు అయ్యాయని వాటిని సంబంధిత పనులు చేసిన కాంట్రాక్టర్ కు చెల్లించానని చెప్పారు. అయితే వ్యక్తిగత రాజకీయాల నేపథ్యంలో బిల్లులు చెల్లింపు పూర్తి అయిన మూడు నెలలకు తాను బిల్లులు చెల్లించాలంటూ కోర్టును ఆశ్రయించారని చెప్పారు. అయితే సంబంధిత కాంట్రాక్టర్ కు బిల్లులు చెల్లించాలని సంబంధిత అధికారులు ఇచ్చిన పత్రాల ఆధారంగానే తాను బిల్లులు చెల్లించానని అందులో తన తప్పు ఎమి లేదని వివరించారు. నిత్యం ప్రజల కష్టాలు తెలుసుకుంటూ విఠలాపురం రమణాల వారి పాలెంలలో మౌళిక వసతులు అభివృద్ధికి తన వంతు కృషి చేస్తున్నారని చెప్పారు. కొందరు కావాలనే నాపై లేని పోని ఆరోపణలు చేసారని, న్యాయపరమైన పోరాటం సాగిస్తానని చెప్పారు. గ్రామకార్యదర్శి నూరుల్లా, మాజీ సర్పంచి విజయరాజు, వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *