సకల శుభాలకు నాంది ఉగాది అని వైఎస్సార్సీపీ తాళ్లూరు మండల ఇన్చార్జి మద్దిశెట్టి రవీంద్ర అన్నారు. షడ్రుతువులు, షడ్రుచుల సమూహారం ఉగాది అని అన్నారు. తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ప్రతిభింబించేలా సంతోషాలతో ప్రజలు పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు. శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సంక్షేమం కోసం సీఎం వైస్ జగన్ అన్న ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో సిరి సంపదలతో ప్రజలందరూ జీవించాలని కోరుకుంటూ ….తాళ్లూరు మండల ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, వైస్ ఎంపీపీలు ఇడమకంటి వెంకటేశ్వర రెడ్డి, ఎం.ఎస్ పి నాగార్జున రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు ఇడమకంటి వేణుగోపాల్ రెడ్డి, వైఎస్ఆర్సిపి నాయకులు గంగిరెడ్డిపాలెం యలమందా రెడ్డి కౌన్సిలర్ విసిరెడ్డి, కోఆప్షన్ మెంబర్ కరిముల్లా, జెసీఎస్ మండల కన్వినర్ యాడిక శ్రీనివాస రెడ్డి, సొసైటీ చైర్మన్ లు శనివారపు శ్రీనివాస రెడ్డి, మంచాల వలసారెడ్డి, సర్పంచిలు మేకల చార్లెస్ సర్జన్, వలి, పోశం శ్రీకాంత్ రెడ్డి, మాజీ సొసైటీ అధ్యక్షుడు పులి ప్రసాద్ రెడ్డి, మాధవస్వామి దేవస్థాన కమిటీ చైర్మన్ పులి అంజి రెడ్డి, గుంటి గంగా భవాని చైర్మన్ కటకంశెట్టి శ్రీనివాస రావు, కేవి పాలెం యూత్ అధ్యక్షుడు విష్ణు తదితరులు ఉన్నారు.
సకల శుభాలకు నాంది ఉగాది – ఉగాది శుభాకాంక్షలు తెలిపిన తాళ్లూరు మండల ఇన్చార్జి మద్దిశెట్టి రవీంద్ర, ప్రజా ప్రతినిధులు, వైఎస్సార్సీపీ నాయకులు
21
Mar