పెట్రోల్ బంకులు యజమానులు పెట్రోలు, డీజిల్ వివరాలను స్టాకు రిజిస్టర్ లో తప్పనిసరిగా నమోదు చేయాలని తహసిల్దార్ ఎస్ ఉష రాణి కోరారు. మండలంలోని బృందావనం(1) పులిపాడు(1) ఉలగల్లు(2) ముండ్లమూరు(3) శంకరాపురం(1) మారేళ్ల(1) ఈదర(1) గ్రామాల లోగల పెట్రోల్ బంకులను గురువారం ఆమె తనకి చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పెట్రోల్ బంకులకు తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండాలన్నారు పెట్రోల్ బంకులకు బీఫామ్ ఉండాలని తెలియజేశారు. ఎక్స్పోజివ్, లీగల్ మెట్రాలజీ, డిస్టెన్స్, స్టాక్ బోర్డు, సామర్ధ్య సాంద్రత, పిల్లర్ పేపర్, కలిగి ఉండాలని ఆమె తెలిపారు. పెట్రోల్ బంకుల వద్ద నీళ్లు ,బాత్రూంలు,జనరేటర్, గాలి ఉండాలన్నారు. ఎవరైనా కల్తీ పెట్రోల్ పోస్తున్నారని తెలిస్తే ఆ పెట్రోల్ బంకును సీజ్ చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ల్యాండ్ సర్వే డిప్యూటీ తహసిల్దార్ టి రవి కాంత్, వీఆర్వోలు కోటయ్య, రమణ, గురవయ్య, దయానందం , అయ్యప్ప, తదితరులు పాల్గొన్నారు.
స్టాకు రిజిస్టర్ తప్పనిసరిగా ఉండాలి- తహసిల్దార్
23
Mar