రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫ్యామిలీ ఫిజీషియన్ లో భాగంగా ఇంటింటికి మెరుగైన వైద్యం అందించడం జరుగుతుందని వైద్యాధికారి సిహెచ్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. మండలం లోని మారెళ్ళ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోగల భీమవరం, పోలవరం గ్రామాలలో గురువారం డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ నందు ఫ్యామిలీ ఫిజీషియన్ వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు వారి ఇంటికి వెళ్లే వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు ఇలాంటి వైద్య శిబిరాలకు వెళ్లి వైద్య సేవలు పొందాలన్నారు. ప్రైవేట్ హాస్పిటల్ దీటుగా ప్రభుత్వ వైద్య శాలలో అధు నూతనమైన పరికరాలతో 74రకాల మందులు12 టెస్టులతో పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేస్తున్నామన్నారు, ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ ఎస్ కే యం యం సుభాని, సుమతి, ప్రసాద్, వినోద్, తదితరులు పాల్గొన్నారు.
