ప్రముఖ పెస్టిసైడ్ సంస్థ అడ్వెంట్జ్ సంస్థ వార్షికోత్సవం విజయవాడ సంస్థ ఆర్.ఎమ్.ఓ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అడ్వెంట్జ్ ఆంద్రప్రదేశ్ రీజనల్ హెడ్ కృష్ణ మూర్తి ముఖ్య అతిధిగా పాల్గోని మార్కెటింగ్ సిబ్బందితో కలసి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ రీజనల్ హెడ్ కృష్ణ మూర్తి మాట్లాడుతూ అడ్వెంట్జ్ సంస్థ వార్షికోత్సవం జరుపుకోవడం సంతోషంగా ఉందని అన్నారు.అడ్వెంట్జ్ అభివృద్ధి తోడ్పడ్డ మార్కెటింగ్ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు అని అన్నారు.రైతులకు అన్ని విధాలుగా ఉపయోగకరంగా వుంటూ వారి అభివృద్ధికి సహాయకరంగా మన సంస్థ మనుగడ పొందటం అభి నందనియం అని అన్నారు.రైతు లేనిదే రాజ్యం లేదని దేశానికి రైతే వెన్నుముక అని వారి విశ్వాసం పొందిన మన సంస్థ అభివృద్ధికి సహకరించిన సంస్థ మార్కెటింగ్ సిబ్బంది, డీలర్ల సహకారాన్ని మర్చి పోలేమని అన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఎస్.ఎమ్.డి.రఫీ,క్రాప్ కేర్ మేనేజర్ రవి చంద్ర,ఎస్.డి.ఓ.విన్య,మార్కెటింగ్ ఆఫీసర్స్,డీలర్స్ పాల్గొన్నారు

