భగత్ సింగ్ ఆశయాలు కొనసాగిస్తాం.. రియల్ హీరో భగత్ సింగ్…….. డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కే వి పిచ్చయ్య…. మాజీ డివైఎఫ్ఐ నాయకులు సందు వెంకటేశ్వరరావు…

భగత్ సింగ్ ఆశయాలు కొనసాగించేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని సీపీఎం కార్యదర్శి కేవీ పిచ్చయ్య అన్నారు.భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్ 92వ వర్ధంతి సందర్భంగా DYFI ఆధ్వర్యంలో దర్శి లోని ప్రశాంత స్కూల్ మరియు బీ సీ కాలేజీ బాలుర హాస్టల్ నందు ఘనంగా నిర్వహించడం జరిగినది. ముందుగా అమరవీరుల చిత్రపటానికి వసంత స్కూల్ డైరెక్టర్ ఎస్ వెంకటేశ్వర్లు, బీసీ కాలేజీ హాస్టల్ వార్డెన్ పుల్లారావు, మాజీ డివైఎఫ్ఐ నాయకులు సందు వెంకటేశ్వరరావు, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కే వి పిచ్చయ్య లు పూలమాలవేసి నివాళులర్పించినారు. పాల్గొన్న విద్యార్థుల తోటి ప్రతిజ్ఞ చేపించినారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ 1928 లో బ్రిటిష్ ప్రభుత్వం, కార్మిక ఉద్యమాలను అణచి వేయడానికి, ప్రజా భద్రత బిల్లు పారిశ్రామిక సంబంధాల బిల్లును తీసుకువచ్చింది అని అన్నారు.ఇవి రెండూ విప్లవ కార్మిక ఉద్యమాలను నిషేధించేవే వీటికి వ్యతిరేకంగా ఏప్రిల్ 8న పార్లమెంట్ లో బాంబు వేసి సంచలనం సృష్టించాలని, ఈ నిరంకుశ బిల్లులను వ్యతిరేకంగా చైతన్యం తీసుకురావాలని భగత్ సింగ్ బృందం భావించి. ఓటు కేశవ దత్తుతో కలిసి భగత్ సింగ్ ఈ బాంబులు వేశారు.తప్పించుకోకుండా అక్కడే నిలబడి నినాదాలు ఇచ్చారు. కామ్రేడ్ భగత్ సింగ్ ,రాజ్ గురు, సుఖదేవులను బ్రిటిష్ ముష్కరులు ఉరి తీసిన మార్చి 23 లౌకిక ప్రజాస్వామ్య దినముగా ప్రకటించాలని డిమాండ్ చేసినారు. భగత్ సింగ్ ఆశయ సాధన కోసం పోరాడుతాం అన్నారు. భగత్ సింగ్ వీలునామాను విద్యార్థులకు పాఠ్యాంశాలు నిర్మించాలని వారుకొరారు..నిలబడి దిక్కులు ఇచ్చిన నినాదాలు ఇంకా సజీవంగానే ఉన్నాయంటే వారి ఆశయాలు లక్ష్యాలు ఇంకా ముందు సాగించవలసిన కర్తవ్యాలు మిగిలి ఉన్నాయని వాటి సాధనకు నేటి తరం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.. భగత్ సింగ్, సుఖదేవ్, రాజు గురు, లాంటి వారు భారతదేశాన్ని దాస్య శృంకల నుంచి విముక్తి చేయడానికి అమరులైన చారిత్రక దినం నేడు మనం జరుపుకుంటున్నామని అన్నారు..ఈ కార్యక్రమంలో టివైఎఫ్ఐ మండల అధ్యక్షులు ఆర్ జెస్సీ పాల్ , గంగారావు. విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *