మెరిట్ స్కాలర్షిప్ కు ఆదర్శ పాఠశాల విద్యార్థులు ఎంపిక

ముండ్లమూరులోని ఆదర్శ పాఠశాల విద్యార్థులు ఎన్ ,ఎం ,ఎం,ఎస్ మెరిట్ స్కాలర్షిప్ ఎంపికైనట్లు ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ కే పూర్ణచంద్రరావు శుక్రవారం ఒక ప్రకటన లో తెలిపారు. ఇటీవల నిర్వహించిన మెరిట్ స్కాలర్షిప్ పరీక్షలలో పరీక్షలు రాసిన 6 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. వారందరికీ మెరిట్ స్కాలర్షిప్ మంజూరైనట్లు ఆయన తెలిపారు.తొమ్మిదవ తరగతి, పదవ తరగతి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం, ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం, నాలుగు సంవత్సరాల పాటు, సంవత్సరానికి ఒక్కొక్కరికి12500 రూపాయల లెక్కన స్కాలర్షిప్ వస్తుంది అన్నారు. స్కాలర్షిప్ కు ఎంపికైన వారిలో బాదం శరణ్య, జిల్లెలమూడి కిషోర్, సూరబోయిన వెంకట సూర్య, పట్లవత్తు విజయ నాయక్, బొజ్జ హేమంత్ శ్రీ నందన్, కటారి బాలకృష్ణ ఎంపికయ్యారు. ఎంపికైన విద్యార్థులను ప్రిన్సిపాల్ కే పూర్ణచంద్రరావు, ఉపాధ్యాయులు అభినందన లు తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *