పోషకాహార లోప నివారణ సర్వే క్రమపద్ధతిలో నిర్వహించాలని ఐసీడీఎస్ సీడీపీఓ సీహెచ్ భారతి అన్నారు. తూర్పు గంగవరంలో శుక్రవారం పోషణ పక్వాడ కార్యక్రమం నిర్వహించారు. పోషకాహారం తగిన మోతాతులో తీసుకుని ఆరోగ్యంగా ఉండేలా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అవగాహన కల్పించారు. 0 నుండి ఆరు సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలు ఎత్తు మరియు బరువులు తీసి, పోషకాహార లోపం ఉన్న వారిని పోషన్ ట్రాకర్ అప్లికేషన్లో నమోదు చెయ్యాలని సూచించారు. బాలా మృతం యొక్క పోషక విలువలు కోల్పోకుండా ఉపయోగించటంపై తల్లులకు అవగాహన కల్పించారు. బెబీ ఫుడ్ వంటకాలను ప్రదర్శించారు. సూపర్వైజర్ జ్యోతి, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు తదితరులు పాల్గొన్నారు.
పోషకాహార లోప నివారణకు సర్వే క్రమపద్ధతిలో చెయ్యాలి.
24
Mar