తాళ్లూరు మండలంలో ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవంను శుక్రవారం నిర్వహించారు. తూర్పుగంగవరం ప్రాధమిక ఆరోగ్య కేంద్రం పరధిలో బొద్దికూరపాడు పంచాయితీలోని చింతలపాలెంలో ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా పీహెచ్ సి వైద్యాధికారి బంకా రత్నం క్షయ వ్యాధి పట్ల అవగాహన కల్పించారు. ప్రభుత్వం క్షయ వ్యాధి రోగికి నెలకు రూ. 500 అందిస్తున్నట్లు చెప్పారు. ఉచితంగా కోడిగ్రుడ్లు, పౌష్టికాహారం అందించారు. వైద్యురాలు మౌనిక సీహెచ్ మరియమ్మ, హెచ్. వి సుశీల, హెచ్ఎస్ వెంకటేశ్వర్లు, ఆరోగ్య, ఆశ, కార్యకర్తలు, అంగన్వాడీ, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
