తాళ్లూరు మండలంలో ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవంను శుక్రవారం నిర్వహించారు. తాళ్లూరు ప్రాధమిక ఆరోగ్య కేంద్రం పరధిలో ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా పీహెచ్సీ వైద్యాధికారి ఖాదర్ మస్తాన్ బి ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. క్షయ వ్యాధికి క్రమం తప్పకుండా మందులు వాడి అదుపులో ఉంచుకోవాలని కోరారు. సీహెచ్ఓ ప్రమీల్, హెచ్ ఓ కొప్పాలు శ్రీనివాసరావు, హెచ్ఎస్ రవి, ఫార్మాసిస్ట్ రమేష్ ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
