జిల్లాలో ప్రసిద్ధి చెందిన గుంటి గంగా భవాని ఆలయం వద్ద దాతల సహకారంతో నిర్మించిన ప్రత్యేక వసతి గదుల కాంప్లెక్సు న్ను శనివారం ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ ప్రారంభించనున్నట్లు ఆలయ కమిటి చైర్మన్ కటకంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. ఆయనతో పాటు వైఎస్సార్సీపీ నాయకులు మద్దిశెట్టి రవీంద్ర, మద్దిశెట్టి శ్రీధర్లు, ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ మారం వెంకటరెడ్డిలు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభిస్తారని వైఎస్సార్సీపీ నాయకులు, భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చెయ్యాలని కోరారు.
