విద్య, వైద్య రంగాలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ అన్నారు. స్థానిక ప్రాధమిక ఆరోగ్య కేంద్రంను శనివారం ఆయన తనిఖీ నిర్వహించారు. వైద్యశాలకు ప్రభుత్వం అందించిన రూ. 4లక్షల విలువైన అల్ట్రా సౌండ్ స్కాన్ పరికరాన్ని ప్రారంభించారు. వైద్యశాలలో అందిస్తున్న సేవలను వైద్యాధికారి బి. రత్నం ఎమ్మెల్యేకు వివరించారు. మరింత మెరుగ్గా సేవలు అందించి ప్రజల మన్ననలు పొందాలని సూచించారు. వైద్యులకు శిక్షణపొందిన అనంతరం వైద్య సేవలు అందిస్తామని వైద్యాధికారి ఎమ్మెల్యేకు వివరించారు. వైస్సార్సీపీ తాళ్లూరు మండల ఇన్చార్జి మద్దిశెట్టి రవీంద్ర, హెచ్సీసీ చైర్మన్, ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, వైస్ఎంపీపీలు ఇడమకంటి వెంకటేశ్వర రెడ్డి, ఎంఎన్పీ నాగార్జున రెడ్డి, కమిటీ మెంబర్లు, సర్పంచి పీఎస్ శ్రీకాంత్ రెడ్డి, ఉప సర్పంచ్ కాశిరెడ్డి, విజిలెన్స్ కమిటీ మెంబర్ సోము అనిల్ కుమార్ రెడ్డి , కుమ్మిత జయరామి రెడ్డి పల్లెబోయిన వెంకటేశ్వర్లు, జెసీఎస్ కన్వినర్ యాడిక శ్రీనివాస రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
