గర్భిణీ స్త్రీలు బాలింతలు ఐదు సంవత్సరాల లోపు చిన్నారుల పట్ల వ్యాధి నిరోధక టీకాలు వేసే సమయంలో పలు జాగ్రత్తలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని ఇమ్యునైజేషన్ జిల్లా అధికారిని వాణిశ్రీ అన్నారు. మండలంలోని మారెళ్ళ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గల శంకరాపురం గ్రామాన్ని శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా వాణిశ్రీ మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు బాలింతలు చిన్నారులు ఎంతమంది ఉన్నారు వారి వివరాలు సేకరించి ఎంతమంది కి టీకాలు వేశారు వాటి వివరాలను రికార్డు లో పొందుపరచాలన్నారు. టీకాలు వేసే సమయంలో సిబ్బంది పలు జాగ్రత్తలు తీసుకోవాలి అన్నారు. సిబ్బంది ప్రతి ఇంటికి తిరిగి ఆరోగ్యం పై అవగాహన కల్పించాలని అన్నారు. అనంతరం రికార్డులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ వెంకటరావు, హెచ్ వి ఎస్కే హుస్సేన్ బి, ఏఎన్ఎం ప్రియదర్శిని, సిహెచ్ఓ కోడూరు శశి, ఆశాలు పాల్గొన్నారు.
వ్యాధి నిరోధక టీకాల పట్ల అప్రమత్తంగా ఉండాలి
25
Mar