తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజారపు అచ్చం నాయుడు జన్మదిన వేడుకలను ఆదివారం మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మండలంలోని శంకరాపురం గ్రామంలో మండల టిడిపి అధ్యక్షులు కూరపాటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం గ్రామ సర్పంచి కూరపాటి మహేశ్వరి నారాయణస్వామి అధ్యక్షతన జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ జెడ్పిటిసి సభ్యులు కొక్కెర నాగరాజు హాజరైనారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అభివృద్ధి లక్ష్యంగా అహర్నిశలు శ్రమిస్తున్న కింజారపు అచ్చం నాయుడు మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని కోరారు. ఒంగోలు పార్లమెంటు టిడిపి అధికార ప్రతినిధి కొర్రపాటి బుచ్చిబాబు మాట్లాడుతూ ఈ మధ్య జరిగిన పట్టభద్రులు ఎమ్మెస్సీ ఎన్నికలలో టిడిపి మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో కైవసం చేసుకుని టిడిపి కార్యకర్తల లో ఉత్తేజం నింపిందన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎన్నికలలో టిడిపి తరఫున పోటీ చేసి పంచుమర్తి అనురాధకు గెలవడం శుభ పరిణామం అన్నారు. ఆయన ఆధ్వర్యంలో 2024 లో ఘనవిజయం సాధించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ మాజీ అధ్యక్షులు గంగినేని వెంకటరావు, పసుపుగల్లు మాజీ సర్పంచ్ ఇందూరీ పిచ్చిరెడ్డి, మాజీ ఎంపీటీసీ జంపాని శ్రీనివాసరావు, పేరం హనుమంతరావు, గంగినేని శ్రీనివాసరావు, మందలపు వెంకటేశ్వర్లు, మేడికొండ పూర్ణాంజనేయులు, మేడికొండ శివశంకరరావు, తదితరులు పాల్గొన్నారు.
