ఆర్యా ‘చెత్త’ గించవలెను -అధికారుల నిర్లక్ష్యంతో ప్రజలు ఇబ్బందులు రోడ్ల వెంబడి చెత్త – పైపుల లీకులతో గుంతల మయం అవుతున్న రోడ్లు దృష్టి సారించని అధికారులు

ప్రతి పల్లెలో చెత్తను వేసేందుకు డపింగ్ యార్డ్లను లక్షలు ఖర్చు పెట్టి నిర్మించారు. చెత్త నుండి ఎరువు తయారు చేస్తామని చెబుతున్నారు. అందుకు ప్రతి వారం ఉన్నతాధికారులు వీడియో, టెలికాన్షిరెన్స్లు పెట్టి క్షేత్ర స్థాయిలో అధికారులకు చెబుతున్నారు. అయితే క్షేత్ర స్థాయిలో మాత్రం అధికారుల మాటలు కోటలు దాటుతున్నాయి. చేతలు మాత్రం గడప దాటటం లేదన్న చందంగా తయారు అయినది. తాళ్లూరులో కుంకుపాడు రోడ్డులో దేవాలయాలనికి సమీపాన ఎక్కడి చెత్తను అక్కడే కుప్పులుగా పడవేస్తున్నారు. వెల్లంపల్లి రోడ్ వైపు కస్తూరి బా పాఠశాల ప్రాంతంలో, తూర్పుగంగవరం రోడ్వైపు టిటిడి కళ్యాణ మండపం ప్రాంతంలో గుంటి గంగ రోడ్లో వైద్యశాల ప్రక్కన చెత్తను వేస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలో కుక్కలు, పందులు చేసి వాటిని రోడ్ అంతా విస్తరించేలా చేస్తున్నాయి. దీనికి తోడు దుర్వాసన వెదజల్లుతున్నది. నిత్యం మండల కేంద్రంలో అధికారులు తిరుగుతూ ఉన్నా సరే సమస్యను పట్టించుకోవటం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. అదే విధంగా పారివేట సమీపంలో నిత్యం బోరు వాటర్ పైప్ లీక్ కావటంతో నీరు వృధా అవుతున్నది. రోడ్లు ధ్వసం అయి పెద్ద పెద్ద గుంతలు పడుతున్నాయి. పలు చోట్ల లీక్ వలన తాగు నీరులో బోరు నీరు కలుస్తుందని అంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చెత్త శుద్ది పట్ల చిత్త శుద్ది కలిగి తొలగించాలని, నీటి శుభ్రతను కాపాడాలని ప్రజలు కోరుకుంటున్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *