ఆపదలో ఉన్న ప్రజలకు 108, 104 అపద్బాంధవులు. నేడు అందులో పని చేస్తున్నా సిబ్బంది జీతాలు లేక విల విల లాడుతున్నారు. రాష్ట్రంలో దాదాపు 7000 మంది పైగా 108, 104సిబ్బంది తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు .104, 108 గత మూడు నెలలుగా జీతాలు చెల్లించడంలో అరబిందో సంస్థ మీనమేషాలు లెక్కిస్తుండడంతో వారి కష్టాలకు పరాకాష్టగా మారాయి . మూడు నెలలు కావస్తున్న ప్రభుత్వం నుండి రావలసిన విడుదలలో జాప్యం కారణంగా, జనవరి 2023 & ఫిబ్రవరి 2023 నెలల జీతాల చెల్లింపులో అరబిందో ఈ .ఎం .ఎస్ యాజమాన్యం కూడా ప్రభుత్వం నుంచి నిధులు పొందేందుకు ఆలస్యం అవుతుండటం తో …నిధులు ఈ నెల చివరలో వచ్చే అవకాశం ఉంది…అయినప్పటికీ జీతాలు చెల్లించాల్సిన యాజమాన్యం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. ప్రభుత్వం నుండి నిధులు ఆలస్యమైన దానితో సంబంధం లేకుండా జీతాలు చెల్లించి ఆదుకోవాల్సిన అరబిందో యాజమాన్యం సైతం జీతాలు చెల్లించక ప్రభుత్వం నుండి వచ్చే నిధులు కోసం ఎదురుచూస్తున్నారు .దేనితో నెల వారి జీతాల పై ఆధారపడి జీవించే వేతన జీవులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంటి అద్దెలు కిరాణా ఖర్చులకు సైతం నగదు లేక తీవ్ర ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్నారు.
నిత్యం ఆపదలో ఉన్నవారికి రక్షణగా నిలుస్తూ పోరాడే ప్రాణ రక్షకులుగా పనిచేసే 108, 104 ఉద్యోగులకు జీతాలు సకాలంలో రాకపోవడంపై వారు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వం, అరబిందో సంస్థ స్పందించి ఉద్యోగులకు జీతాలు అందించి ఆదుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
108 అపద్బాంధవులు జీతాలు లేక విల విల – ఇంటి అద్దెలకు నెలవారీ ఖర్చులకు కరువే తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న 108, 104 సిబ్బంది – బిల్లులు మంజూరు కాకపోవడంతో జీతాలు చెల్లించడంలో మీనమేషాలు లెక్కిస్తున్న అరబిందో సంస్థ – రాష్ట్రంలో ఇబ్బందులు పడుతున్న 7వేల మంది పైగా 108, 104, సిబ్బంది
26
Mar