రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహణ – 1251 మందికి వైద్యపరీక్షలు

దర్శి పిజిఎన్ కాంప్లెక్స్ కల్యాణ మండపం వద్ద రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్యభిరాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ వైద్యశిబిరాన్ని దర్శి డిఎస్పి నారాయణస్వామిరెడ్డి ప్రారంభించారు. గుంటూరు శంకర్ కంటి వైద్యశాల, ఒంగోలులోని వివిధ వైద్యశాలకు చెందిన వైద్యనిపుణులు శిబిరంలో పాల్గొని 1251 మందికి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో వైద్యశిబిరానికి వచ్చిన వారికి భోజన వసతి కల్పించారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షుడు సానికొమ్ము తిరుపతిరెడ్డి, కార్యదర్శి రెడ్డిమాసు శ్రీనివాసరావు, కోశాధికారి రమణారెడ్డి, వైద్యులు డాక్టర్ కృష్ణారెడ్డి, డాక్టర్ కోటిరెడ్డి, డాక్టర్ ఎస్ఎం. బాషా, కర్నా వెంకటేశ్వరరెడ్డి, రాహుల్, రమాలక్ష్మి, మహేంద్రరెడ్డి, నాగమణి, ఝాన్సీ, రమణారెడ్డి, వైస్ ఎంపీపీ దుర్గారెడ్డి, సంఘ సేవకుడు జీవి రత్నం తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *