ముండ్లమూరు మండలంలో విద్యుత్ శాఖ రైతులకు, ప్రజలకు ఎలాంటి సమస్యలు లేకుండా అభివృద్ధి పదంలో నడిపిస్తున్న విద్యుత్ ఏఈ జె భూరాజును విద్యుత్ సిబ్బంది ఘనంగా సన్మానించారు. స్థానిక విద్యుత్ సబ్ స్టేషన్ లో పదవి బాధ్యతలు చేపట్టి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకు కేక్ కట్ చేసి సిబ్బంది అభినందనలు తెలిపారు .ఈ సందర్భంగా సిబ్బందితో ఏఈ మాట్లాడుతూ…. మండలంలో విద్యుత్ సమస్యల పరిష్కారంలో సిబ్బంది సహాయ సహకారా లు మరో లేమని అన్నారు ఇలానే నిత్యం తమ సహకారంతో మంచి పేరు తీసుకురావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో దర్శి నియోజకవర్గ సర్పంచుల సంఘం కన్వీనర్ ఓగులూరి,రామాంజి లైన్ మాన్ ఆంజనేయులు, సోమ్లా నాయక్, మణికంఠ, అగ్రికల్చర్ కాంట్రాక్టర్ బాలాజీ, విజయ్, నాగరాజు, రవి తదితరులు పాల్గొన్నారు.
