సీఎం వైఎస్ జగన్ కు ఘన స్వాగతం -అధినేతకు స్వాగతం

జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి మంత్రులు, ఎంపీ, పార్టీ నాయకులు, అధికారులు స్వాగతం పలికారు. కొండపి నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జి వరికూటి అశోక్ బాబు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి వరికూటి అమృతపాణి, వరికూటి వెంకట రమణారావుల మాతృమూర్తి కోటమ్మ భౌతికకా యానికి నివాళులర్పించేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి సోమవారం వచ్చారు. ఉదయం తాడేపల్లి నివాసం నుంచి హెలికాఫ్టర్లో బయలుదేరి టంగు టూరు మండలం కారుమంచి గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్లో సీఎం జగన్ మోహన్ రెడ్డి 11:15 నిమిషాలకు దిగారు. ఆయనతోపాటు పార్టీ రీజినల్ కోఆర్డినేటర్, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసులరెడ్డి కూడా ఉన్నారు. కలెక్టర్ దినేష్ కుమార్, ఎస్పీ మల్లికా గర్గ్, ఎంపీ, మం త్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, నాయకులు స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గాన అంబేడ్కర్ క్రీడాప్రాంగణంలో కోటమ్మ భౌతికకాయానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శిం చారు. తిరిగి హెలిప్యాడ్ వద్దకు చేరుకొని పార్టీ నాయకులతో మాట్లాడారు. తనను కలిసేందుకు వచ్చిన దివ్యాంగుడిని ఆప్యాయంగా పలుకరించారు. మధ్యాహ్నం 12:23 ముఖ్యమంత్రి వైఎస్ జగన్ , బాలినేని శ్రీనివాసులరెడ్డి హెలికాఫ్టర్లో తాడేపల్లికి బయలుదేరారు. తక్కువ సమయంలో సీఎం పర్య టన విజయవంతం చేసినందుకు కలెక్టర్ దినేష్ కు మార్, ఎస్పీ మలికా గర్గ్కు, అని శాఖల అధికారులకు వరికూటి అశోక్ బాబు ధన్యవాదాలు తెలిపారు. మం త్రులు ఆదిమూలపు సురేష్, మేరుగ నాగార్జునరెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్య క్షుడు జంకె వెంకటరెడ్డి, రాష్ట్ర ఆరోగ్య శ్రీ ప్రత్యేక అధికారి డాక్టర్ యాదాల అశోక్, టీటీడీ బోర్డు మెం బర్, కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్, చీరాల, మార్కాపురం, ఎస్ఎన్ఎ్పడు, గిద్దలూరు, దర్శి ఎమ్మెల్యేలు కరణం బలరాం, కుందురు నాగార్జునరెడ్డి. టీజేఆర్ సుధాకర్ బాబు, అన్నా రాంబాబు, డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్, పార్టీ ఇన్చార్డులు కరణం వెంకటేష్
బాచిన కృష్ణ చైతన్య, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ పోతుల సునీత, ఆర్యవైశ్య కార్పొరే షన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, ఒంగోలు నగర మేయర్ గంగా సుజాత, సీఎం సలహాదారు బత్తులు బ్రహ్మానందరెడ్డి వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *