ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, సీడాప్, జిల్లా ఉపాధి కార్యాలయం సం యుక్త ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మద్ది శెట్టి వేణుగోపాల్ అన్నారు. జాబ్ మేళా గోడ పత్రికను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ మాట్లాడుతూ… ఈనెల 29న దర్శిలో మెగా జాబ్ మేళా ఏర్పాటు చేశారన్నారు. పదో తరగతి ఆపై తరగతులు చదువుకున్న నిరుద్యోగుల కోసం జిల్లా స్థాయి జాబ్ మేళా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ జాబేళాలో అపెక్స్ సొల్యూషన్స్ లిమిటెడ్, బైజుస్, ఐజాన్ ఎక్స్పీరియన్సెస్, ముతూట్ ఫైనాన్స్, జోయాలుక్కాస్, హెటో రోడ్రగ్స్, మెడ్లస్ ఫార్మసీ, గ్రీన్లెక్ ఇండస్ట్రీస్, కళ్లం టెక్స్టైల్స్, అరబిందో ఫార్మా, షిరిడీసాయి ఎలక్ట్రికల్స్, తిరుమల ఆటోమోటివ్స్, పేటీఎం తదితర కంపెనీల ప్రతినిధులు పాల్గొనున్నట్లు తెలిపారు. ఈ ఉద్యోగ మేళాలో ఎంపికైన వారికి కనీస జీతం రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు ఉంటుందన్నారు. రిజిస్ట్రేషన్ కోసం 99888 53335, 80744 12692, 62812 05538
ఫోన్ నంబర్లను సంప్రదించాలన్నారు. కార్యక్ర మంలో జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఆర్ లోకనాథం, సీడాప్ ట్రైనర్ బీ అజయ్, ఏపీఎస్ఎ సీడీసీ పీఈ ఎస్కె బాషా, ఎంపీపీలు సుంకర సునీతా బ్రహ్మారెడ్డి, సుధారాణి, తాటికొండ శ్రీని వాసరావు, వైఎస్సార్ క్రాంతిపథం ఏరియా కోఆర్డినేటర్ వసుంధరాదేవి, ఏపీఎంలు విజయ కుమారి, హనుమంతరావు, వైఎస్సార్సీపీ నాయ కులు పాల్గొన్నారు.


