సివిల్స్, గ్రూప్స్, స్టాఫ్ సెలక్షన్, రైల్వే రిక్రూట్మెంట్కు ఉచిత శిక్షణ

*📚✍️బీసీ స్టడీ సర్కిళ్ల*
*బలోపేతం📚✍️*

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

రాష్ట్రంలో వెనుకబడిన తరగ తులు (బీసీ) యువతకు మేలు చేసేలా బీసీ స్టడీ సర్కిళ్లను మరింత బలోపేతం చేసేందుకు ప్రభు త్వం కార్యాచరణ చేపట్టింది. వీటి నిర్వహణ కోసం ఈ ఏడాది బడ్జెట్లో ప్రభుత్వం రూ.8 కోట్లు కేటా యించింది. రాష్ట్రంలో ప్రస్తుతం 13 బీసీ స్టడీ సర్కిళ్లు ఉన్నాయి. వాటి ద్వారా నిరుద్యోగ విద్యా వంతులకు ఉచిత శిక్షణ ఇచ్చి మిగిలిన వారితో దీటుగా పోటీ పడి అవకాశాలు దక్కించుకునేలా తీర్చిదిద్దుతారు. అభ్యర్థులకు ఉచిత శిక్షణతోపాటు స్టెఫెండ్, మెటీరియల్, పుస్తకాలు అందించను న్నారు. సివిల్ సర్వీసెస్, గ్రూప్-1, గ్రూప్-2, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ), రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్ఆర్బీ), పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (పీఆర్బీ), డీఎస్సీ వంటి పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. బీసీ స్టడీ సర్కిళ్లలో ప్రవేశం కోసం రూ.లక్ష వార్షిక ఆదాయ పరిమితిగా నిర్ణయి ంచారు. రాష్ట్రంలో ప్రస్తుతం నిర్వహిస్తున్న 13 స్టడీ సర్కిళ్లలో ప్రవేశానికి రిజర్వేషన్ ప్రాతిపదికన సీట్లు కేటాయిస్తారు. బీసీలకు 66శాతం, ఎస్సీలకు 20 శాతం, ఎస్టీలకు 14శాతం సీట్లు కేటాయించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *