రాష్ట్రంలో 2020-21 నుంచి ప్రవేశపెట్టిన నాలుగేళ్ల ఆనర్స్ డిగ్రీలో నాలుగో ఏడాది పరిశోధన, ఆనర్స్ యూజీ కోర్సులను ఉన్నత విద్యామండలి తీసుకురానుంది. విద్యార్థులు మూడేళ్ల తర్వాత కావాలనుకుంటే బయటకు వెళ్లిపోవచ్చని, ఒకవేళ నాలుగో ఏడాది చదవాలనుకుంటే ఆనర్స్ డిగ్రీ చేయొచ్చని ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ రామమోహన్రావు తెలిపారు. మూడేళ్లలో కలిపి 75 శాతం కంటే ఎక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులు మాత్రమే పరిశోధనను ఎంచుకునే అవకాశం ఉంటుంది. మిగతా వారు ఆనర్స్ యూజీ కోర్సులను చదువుకోవచ్చు. పరిశోధన కాకుండా ఇతర కోర్సుల్లో సింగిల్ లేదా డ్యూయల్ సబ్జెక్టులను ఎంచుకునే అవకాశం కల్పించేందుకు కసరత్తు చేస్తు న్నారు. యూజీసీ సూచించిన నిబంధనల ప్రకారం నాలుగేళ్లు డిగ్రీని తీసుకొచ్చారు. నాలుగో ఏడాది రెండు సెమిస్టర్లకు కలిపి పది పేపర్లు ఉంటాయి. వీటిల్లో సబ్జెక్టుకు అనుబంధంగా మూడు పేపర్లు చొప్పున నైపుణ్య శిక్షణ సబ్జె క్టులు ఉంటాయి. నాలుగేళ్లు డిగ్రీ పూర్తి చేసిన వారికి ఏడాది పీజీ చేసే అవ కాశం కల్పిస్తారు. ఏడాది పీజీ కోర్సులను విశ్వవిద్యాలయాలు రూపొందించాల్సి ఉంది. నాలుగో ఏడాదిలో పరిశోధన పూర్తి చేసిన విద్యార్థులు నేరుగా పీహెచ్డీకి అర్హత సాధిస్తారు. * జాతీయ విద్యా విధానం ప్రకారం వచ్చే ఏడాది నుంచి డిగ్రీలో సింగిల్, డ్యూయల్ సబ్జెక్టు విధానం తీసుకురాబోతున్నారు. ఈ విధాన రూపకల్పన, సిలబస్ తయారీకి ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేసినట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి వెల్లడించారు. విద్యార్థులు ఒక సబ్జెక్టు ప్రధా నంగా చదువుతూ మరో మూడు మైనర్ సబ్జెక్టులను ఎంచుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులు ఎంచుకున్న కోర్సులు, ఆసక్తి మేరకు మైనర్ సబ్జెక్టులు చదువుకోవచ్చు.
మూడేళ్లలో 75% మార్కులు ఉంటేనే పరిశోధనకు అర్హత
28
Mar