పేద విద్యార్థులకు ప్రైవేటు, అన్ఎయిడెడ్
పాఠశాలల్లో 25 శాతం ఉచిత ప్రవేశాలు కల్పించాలన్న లక్ష్యంతో విద్యా హక్కు చట్టంలో సెక్షన్ 12(1)సీ కింద ప్రవేశాలను సులభతరం చేసేందుకు ఆన్లైన్ పోర్టల్ ప్రారంభించినట్లు పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ విద్యా సంవత్సరానికి ఈ నెల 22 నుంచి ఏప్రిల్ 10 వరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామన్నారు. అర్హులైనవారు గ్రామ, వార్డు సచివాలయాల్లోని ఆన్లైన్లో ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. మరిన్ని వివరాలకు 14417, 95026 66864 నంబర్లలో సంప్రదించాలన్నారు.
విద్యాసంస్థల్లో 25%- ఉచిత సీట్లకు పోర్టల్
28
Mar