ముండ్లమూరులోనీ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో2023–2024 వచ్చే విద్యా సంవత్సరానికి6వ తరగతి తో పాటు ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్య అభ్యసించేందుకు ఆన్లైన్లో వచ్చే నెల ఏప్రిల్ 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ప్రిన్సిపాల్ ఆవుల సునీత తెలిపారు. బడి బయట పిల్లలు, పేద పిల్లలు, అనాధ పిల్లలు, బడి మానివేసిన పిల్లలు, ఎస్సీ ,ఎస్టీ ,బీసీ ,మైనారిటీ, బిపిఎల్ ,పరిధిలోగల బాలికలు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. 6వ తరగతిలో 40 సీట్లు, 7వ తరగతిలో1 సీటు, 8వ తరగతిలో1 సీటు, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఎంపీసీ గ్రూపులో 40 సీట్లు ఉన్నాయని ఆమె తెలిపారు. ఎంపికైన విద్యార్థులకు వారి వారి మొబైల్ కు సందేశం వస్తుందని అన్నారు. వివరముల కోసంhttp.. 11Ap.kgbv , apcf.ss ఇన్ll వెబ్ సైట్ లో ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని ఆమె అన్నారు.
కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ప్రవేశానికి దరఖాస్తులు
28
Mar