ముండ్లమూరు మండలంలోని ఉమామహేశ్వరపురం అగ్రహారం లో నూతనంగా నిర్మిస్తున్న రామాలయానికి దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ లక్షన్నర రూపాయల విరాళాన్ని మంగళవారం అందజేశారు. దర్శి లోని క్యాంపు కార్యాలయంలో గ్రామానికి చెందిన వైఎస్ఆర్ సీపీ నాయకులు చింతల అంజిరెడ్డి, వేముల శ్రీనివాసులకు నగదును అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆలయాల అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయన్నారు. గ్రామస్తులు ఐక్యంగా రామాలయ నిర్మాణా కార్యక్రమంలో పాల్గొనడం అభినందనీయమన్నారు.
రామాలయానికి లక్షన్నర విరాళం అందజేసిన ఎమ్మెల్యే మద్దిశెట్టి
28
Mar