రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న జగనన్న గృహాలను ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉండాలని గృహ నిర్మాణ శాఖ ఈ ప్రసాద్ రావు అన్నారు. స్థానిక గృహ నిర్మాణ శాఖ కార్యాలయంలో మంగళవారం సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో208 గృహాలు పూర్తి చేయాలనీ ఆదేశించామన్నారు. అందులో 156 గృహాలు పూర్తి అయ్యాయని మిగిలిన 52గృహాలు పూర్తి చేసి గృహప్రవేశాలకు సిద్ధంగా ఉండాలని గృహనిర్మాణ సచివాలయం సిబ్బందికి ఆదేశించామన్నారు. గృహ నిర్మాణాలలో సచివాల సిబ్బంది అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు అన్నారు. ఈ కార్యక్రమంలో డి ఈ నిరీక్షణ రావు, ఏఈ హనుమంతరావు, సచివాలయ గృహ నిర్మాణ అసిస్టెంట్లు, ప్రసన్న, అనూష, దిలీప్, రోబో సింగ్, నాయక్, అనూష, మజ్మ, ఫర్హ, వర్క్ ఇన్స్పెక్టర్లు చెన్నకేశవులు, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.
జగనన్న గృహాలు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉండాలి
28
Mar