ఎవరికైనా అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు అశ్రద్ధ చేయకుండా వైద్యుల సలహాలు పాటించాలని వైద్యాధికారి సిహెచ్ ప్రవీణ్ కుమార్ అన్నారు. మండలంలోని మారెళ్ళ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గల బొప్పూడి వారి పాలెం గ్రామంలో మంగళవారం ఫ్యామిలీ ఫిజీషియన్ వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ గ్రామాల్లో ఎవరికైనా అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు వెంటనే మీ గ్రామాలలో గల డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ లోకి వెళ్లి వైద్య సిబ్బందిని సంప్రదించి వైద్య సేవలు పొందాలన్నారు .వ్యాధి తగ్గ నప్పుడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్లి వైద్యాధికారిణి సంప్రదించి వైద్య సేవలు పొందాలన్నారు. ఈ శిబిరంలో 55 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా అందులో 30 మందికి షుగర్ పరీక్షలు, 15 మందికి బీపీ పరీక్షలు, ఇద్దరు గర్భిణీలు, 8 మందికి జలుబులు దగ్గులు ఉన్నవారికి పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ నాగేశ్వరరావు, సిహెచ్ఓ దీప్తి, ఆషాలు జే టి ఎన్ బేగం, యేసు మరియమ్మ తదితరులు పాల్గొన్నారు.
వ్యాధుల పట్ల అశ్రద్ధ చేయొద్దు
28
Mar