మహిళా రైతులు, రైతు ఉత్పత్తి దారుల సంఘాలను ఏర్పాటు చేసి పంటల ఉత్పత్తుకు మార్కేటింగ్ చేయటం ద్వారా అదపు వాల్యూ పెంపొందించవచ్చని ఎపీఓ దేవరాజ్ అన్నారు. వైఎస్సార్ క్రాంతి పథం కార్యాలయంలో మంగళవారం మహిళా సంఘాల సభ్యులతో వ్యవసాయాధికారి ప్రసాదరావు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. వ్యవసాయాధికారి మాట్లాడుతూ మహిళా రైతులు ఉత్పత్తి దారుల సంఘం ఖాతాను ఏర్పాటు చేసుకుని దశల వారిగా గ్రూపులను బలోపేతం చేస్తూ పంటలకు కావలసిన విత్తనాలు, ఎరువులు, యంత్ర పరికరాలు అమ్మకాలు, కొనుగోళ్లతో విలువ జోడింపు చేసుకోవ్చని చెప్పారు. మండల మహిళా సంఘ అధ్యక్షురాలు విజయలక్షి సీసీ కోటేశ్వరరమ్మ తదితరులు పాల్గొన్నారు.
పంట ఉత్పత్తుల విలువలు పెంచేలా కృషి చెయ్యాలి – మహిళా సంఘ సభ్యులతో ఎఫ్.పీ. ఓలు బలోపేతం
28
Mar