క్రమ శిక్షణతో విద్యను అభ్యసించాలి -అన్నీ రంగాల్లో అభివృద్ధి సాధించాలి -జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ

బాలికలు క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలకు ఎదగాలని ..నేటి బాలలు రేపటి పౌరులుగా ఎదిగి అన్నీ రం గాల్లో అభివృద్ధి చెందడమే సీఎం వైఎస్ జగన్ ఆకాంక్ష అని జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకా యమ్మ అన్నారు. స్థానిక బాలికల ఉన్నత పాఠశాల వార్షిక వేడుకలకు మంగళవారం జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకా యమ్మ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విద్యార్థు లతో కోలాటం ఆడి అందరినీ ఉత్సాహ పరిచారు. వెంకాయమ్మకు పూలు చల్లుతూ ఘన స్వాగతం పలికి పూల మాలలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ వెంకాయమ్మ మాట్లాడుతూ… ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి సీఎం వైఎస్ జగనన్న చేస్తున్న కృషి మరువలేనిదని అన్నారు. నాడు – నేడు ద్వారా పాఠశాలలను అత్యంత సుంద రంగా తీర్చిదిద్దారన్నారు. జగనన్న గోరుముద్ద పేరుతో బలమైన, రుచికరమైన ఆహారాన్ని అందిస్తు న్నారన్నారు. పాఠశాల స్థాయి నుంచే ఇంగ్లిషమీడియం తో పాటు, కంప్యూటర్ ల్యాబ్లు, ఒకేషన్ కోర్స్లు అందుబాటులోకి తెచ్చారన్నారు. తాను గతంలో వచ్చినప్పుడు సైకిల్ స్టాండ్, డైనింగ్ హాల్ కావాలని విద్యార్థులు అడిగారని అందులో భాగంగా సైకిల్ స్టాండ్ మంజూరు చేశామని, డైనింగ్ హాల్కు టెండర్లు పిలిచినట్లు చెప్పారు. త్వరలోనే నిర్మాణ పనులు మొదలవుతాయన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ సోము దుర్గారెడ్డి, రాష్ట్ర స్టేట్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ఎం భాష ,మాజీ ఎంపీపీ ఇత్తడి దేవదానం, చింతలపూడి శ్రీనివాస్ రెడ్డి, ప్రధానోపాధ్యాయురాలు రమాదేవి, ఉపాధ్యాయనీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *