దర్శి పొట్టి శ్రీరాములు వీధిలో అంగన్వాడి స్కూల్ లో జిల్లా పరిషత్ నిధుల నుండి ఏర్పాటు చేసిన హ్యాండ్ బోర్ ను జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ పరిశీలించారు. అంగన్వాడి చిన్నారులతో ముచ్చటించారు వారికి అందిస్తున్న పోషకాహారాన్ని ప్రీ ప్రైమరీ విద్యను గురించి అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడిలో మౌలిక వసతులకు తన వంతు చేయూత ఇస్తున్నట్లు తెలిపారు కార్యక్రమంలో వైస్ ఎంపీపీ సోము దుర్గారెడ్డి , షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎస్ఎం డాక్టర్ భాషా, మాజీ ఎంపీపీ ఇతర దేవదానం తదితరులు పాల్గొన్నారు.
