ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలంలోని వేంపాడు గ్రామంలో మంగళవారం రాత్రి కొండచిలువ కలకలం రేపింది. గ్రామంలోని బీసీ కాలనీలో చెట్ల మధ్యలో నుంచి కొండచిలువ ఇళ్లలోకి వస్తుండగా స్థానికుల కంటప డింది. దీంతో గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఎంతసేపటికీ వారు రాక పోవడంతో స్థానిక యువకులు గోతం తెచ్చి అం దులో బంధించే ప్రయత్నం చేసినా ఫలించలేదు. ఈ లోపు అది పక్కనే ఉన్న చెట్లలోకి జారుకుంది.
వేంపాడులో కొండచిలువ
కలకలం
29
Mar