రోడ్డు ప్రమాదంలో దంపతులకు గాయాల య్యాయి. ఈ సంఘటన తానంచింతల సమీపంలో మంగళవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కురిచేడుకు చెందిన పెనుగొండ యోగిరెడ్డి, బుచ్చమ్మలు తానంచింతలలోని ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి తిరుగు ప్రయాణం లో పాతవరం రోడ్డు వద్దకు రాగానే మట్టి టిప్పర్ ఢీకొంది. దంపతులు మోటారు సైకిల్ నుంచి కింద పడి గాయపడ్డారు. క్షతగాత్రులను దర్శి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు.
